Wednesday, December 28, 2011

జీవితానికి భీమా

చాలా రోజుల తర్వాత నేను బ్లాగ్ లోకి వచ్చాను.
అసలు లైఫ్ ఇన్స్యూరెన్స్  చేయడం మంచిదేనా
భద్రత కావాలని  జీవితానికి భీమా కి చేయించుకుంటే  మంచిదని చాలా తక్కువ బోనస్ వస్తున్నా సరే తిండి తిప్పలు మాని డబ్బు ఆదా చేసి పాలసీ కడుతున్నాము.
అసలు ఇన్స్యూరెన్స్ చేయడం వలన ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకుని అవసరాలు కూడా మానుకుని..వీలయితే అప్పు చేసి కూడా పాలసీ మొత్తాన్ని కట్టే వాళ్ళు ఉంటున్నారు. ఇలా కట్టే వాళ్ళందరూ భీమా గురించి తెలిసిన వారే. కట్టడం ఎందుకు మంచిదో తెలిసిన వాళ్ళు ఎంతమంది.తెలియని వాళ్ళు ఎంతమంది.? రిస్క్ జరగని పక్షంలో  లభించే మొత్తం చూస్తే వడ్డీ విలువతో తక్కువగా ఉంటుందని చాలా మంది పాలసీ కట్టడం మానేస్తున్నారు.
 ఇలా లెక్కలు వేసుకునే నాకు తెలిసినవారు ఒకరు పాలసీ కట్టడం మానేశారు. దురదృష్టవశాత్తు  అతను యాక్సిడెంట్లో మరణించాడు. అప్పటికే పాలసీ లాబ్స్ అయిపొయి ఆరు నెలలు అయింది. అతని కుటుంబానికి ఆధారం ఏమి లేదు. అతని పైనే ఆధారపడి ఉన్న కుటుంబం రోడ్డున పడింది. ఇంట్లో ఉన్న భార్య అయినా శ్రద్ధ తీసుకుని పాలసీ కట్టుకుంటే బాగుండేది అని భాదపడుతుంది. కుటుంబానికి ఆధారం అయిన యజమాని బయటికివేలితే వస్తాడో     రాడో అన్న తీరులో ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి.
ఇది చూసాక మా ఫ్రెండ్ సర్కిల్ లో అందరు తప్పని సరిగా వాయిదాలని చెల్లిస్తున్నాం.నా భార్యకి కూడా జీవితభీమా
ముఖ్య ఉద్దేశ్యం చెప్పి తనని కూడా పాలసీ దారుగా చేర్పించాను.మీకు నేను చెప్పిన విషయం బచ్చితే మీరు పాలసీ వాయిదా లేకుండా కట్టండి.     

Saturday, October 15, 2011

ప్రేమకు మరణం లేదంట


నాకు ఇష్టమైన ఒక పాత పాట.ప్రేమకి మరణం లేదంట. 

రోజు చాలా చోట్ల పుట్టి చనిపోయే ప్రేమ మరణించినట్లా,మళ్ళీ బ్రతికినట్టా? ఈ కాలం ప్రేమ ..ఛీ ఛీ..  ప్రేమకు మరణం లేదంట. నిజమా ఎక్కడ చూసినా  ప్రేమ పక్షులే! పెళ్లి అంటే ఫైల్ద్యూర్ లవర్ ని   పెళ్లి చేసుకోవడం అని అర్ధం అని మా ఫ్రెండ్ చెప్పేది నిజం.
ప్రేమ వద్దు తొక్క వద్దు చదువుకుని బాగు పడండి రా   బాబూ!అమ్మాయిలు మగవాళ్ళతో..ఆటలోద్దు తల్లులూ..జాగ్రత్తమ్మా..నాశనం కావద్దు.ఎందుకు చెపుతారో వినండి అర్ధం చేసుకుని నడవండి.ప్రేమా గీమా జానేదో మాయా లోకంలో..

Sunday, August 7, 2011

వింత స్నేహితుడు

ఈ రోజు ఫ్రెండ్ షిప్ డే. భలే కొత్త విషయం చెపుతున్నాను కదూ..
నేను నా  ఫ్రెండ్ ఒకరి గురించి చెప్పాలనుకుంటున్నాను. అతని పేరు రవి కుమార్.
అతనికి మౌని అని  ఇంకొక ఫ్రెండ్ఉన్నాడు. మౌని ఒకసారి రవిని  ఇరవై అయిదు వేల రూపాయలు అడిగాడు. రవి ఎప్పటికి కావాలి అని అడిగాడు మౌనిని. నాకు  రేపు ఉదయం తొమ్మిది గంటలకి..ఇవ్వగలవా? అని అడిగాడు.మౌని.
రవి అతనికి ఉదయం ఏడున్నర గంటలకల్లా..అధిక వడ్డీకి తీసుకుని వచ్చి మిత్రునిని ఆదుకున్నాడు.  అందుకు మా స్నేహితుడు స్నేహితుడు మౌని చాలా సంతోషించాడు.
కానీ ఓకే రోజు రవి మౌనిని  కేవలం అయిదు వందల రూపాయలు మాత్రమె అప్పు అడిగాడు.ఒక గంటలో ఇస్తానని  చెప్పి వెళ్ళిపోయి ఆ రోజంతా మొహం చాటేశాడు మౌని.  తర్వాతి రోజు కూడా మళ్ళీ అడిగాడు రవి. సాయంత్రం ఇస్తానని చెప్పాడు.మౌని .కానీ అతను ఆరోజూ ఇవ్వలేదు.అతని వద్ద డబ్బు లేదా అంటే అదేమీ కాదు. అతని వద్ద చాల డబ్బు అప్పుడు ఉంది. కానీ మౌని ఇవ్వడానికి మొహం చాటేశాడు. అలా జరిగింది.
మళ్ళీ కొన్నాళ్ళకి మౌనికి డబ్బు అవసరపడింది. రవిని అప్పు కావాలని అడిగాడు.రవి వెంటనే ఇంటికి వెళ్లి బంగారు నగలు తెచ్చి తాకట్టు పెట్టి మరీ మౌనిని ఆదుకున్నాడు.అలా కొన్నాళ్ళు గడిచాక నిన్ననే ..కేవల రెండువండలు పెట్రోల్ కోసం అప్పు అడిగాడు రవి.నా దగ్గర లేనేలేవని  హ్యాండ్ ఇచ్చాడు మౌని

స్నేహమంటే.. విరిసిన హరివిల్లు లాటిది.
మౌని లాటి వారికి..నా ఫ్రెండ్ రవి లాంటి ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టం. స్నేహాన్ని ఎప్పుడు తన స్వార్దానికే ఉపయోగించుకున్న మౌని లాటి వారు చాలా మంది ఉంటారు.వారిని ఏం అనాలి.? ఫ్రెండ్స్ అనాలా/ అవకాశవాదులు అనాలా? స్నేహమంటే  ..తీసుకోవడమే కాదు. ఇవ్వడం కూడా..అని ఎవరికనినా చెప్పాలనే..ఈ మాట చెపుతున్నాను. రవి లాటి మిత్రుడు అందరికి   దొరకరు.అందుకే రవిని చూస్తే నాకు చాలా గర్వం.
అందరికి..స్నేహితుల రోజు శుభాకాంక్షలు తో.. విష్ణు.

Wednesday, June 29, 2011

మానవత్వం మరుగున పడినవేళ

అందరికి నమస్కారం 
నేను అందరిని ఇక్కడ  చదవడం చాల ఆశ్చర్యముగా  ఉంది.  నేను కూడా మీ అందరితో చాలా విషయాలు పంచుకోవాలని ఉంది.
 నేను వృతి రీత్యా రక్షణ వ్యవస్థలో  పని చేస్తాను. నా అనుభవాలని  ఇక్కడ  అప్పుడప్పుడు వ్యక్తీకరిస్తాను.
ఒక రోజు నేను డ్యూటీ లో ఉండగా కంట్రోల్ రూం  కి తెల్లవారు ఝామున  ఇక పోన్  కాల్ వచ్చింది. విషయం ఏమంటే
ఒక మహిళ హత్య  చేయబందినదని సమాచారం అందింది. నేను మరి కొందరం  కలసి అక్కడికి వెళ్ళాము. అక్కడ ఒక   ఇంట్లో హత్య గావింప బడి ఉంది. జరిగిన విషయం విచారించగా ఆమె భర్త కుటుంబ భాద్యతలు సరిగా నిర్వర్తించక  పర్తి రోజు మద్యం తాగుతూ భార్యని నానా రకాలుగా హింసించే వాడు. అలాంటి    పరిస్థితుల్లో  ఆమెకి ఇంకొక వ్యక్తి తో పరిచయం ఏర్పడింది. ఆమె అతనితో అమే అవసరం దృష్ట్యా   అతనితో  మాట్లాడటమే కానీ  ఎలాటి వివాహేతర సంబంధం ఎరుగదు. అయినా  కూడా  ఆమె భర్త ఆమెని అనుమానించి అర్దరాత్రి వేల భార్య ని అతి క్రూరంగా హింసించి
 కత్తి తో పొడిచి హత్య చేసాడు. హత్య చేసిన  తర్వాత అతను భార్య శవం ప్రక్కనే నిద్రించి తాపిగా లేచి చుట్టూ ప్రక్కల  వారిని గావు కేకలు పెట్టి  పిలిచి నా భార్యని ఎవరో చంపి వేసారు  అని చెప్పి.అతనే కంట్రోల్  రూమ్కి పోన్  చేసి నా భార్యని ఎవరో హత్య  చేసారని చెప్పాడు.  
అక్కడ అన్ని కోణాలులో చూసాక అరగంట లోపే అసలు నేరస్తులు ఎవరో మాకు అర్ధం అయింది. హత్య కావించబడిన తల్లిదండ్రులు  కూడా  అక్కడే ఉన్నారు. ఆ మృత  దేహాన్ని పోస్ట్ మారటం కోసం గవెర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడానికి  శవంని వాహనంలోకి ఎక్కించడానికి మాకు ఎవరు సహకరించలేదు. హత్య కావిన్పబడిన ఆమె మృత దేహాన్ని అంటుకోవడానికి ఆమె తల్లిదండ్రులు అన్నయ్య  తో సహా బంధువులు ఎవరు ముందుకు రాలేదు. నును ఇంకొకరి కలసి.. అంబాసిడర్ కారులో పోస్ట్ మారటం కి తీసుకు వెళ్ళాం.  
మన రక్తం  పంచుకుని పుట్టిన వ్యక్తి  ప్రాణం పోగానే ఆమెని అంటుకోవడానికి కూడా భయపడుతూ అనాధ శవంలా వదిలేసారు. ఎంత మానవత్వం లేనివారు ఈ మనుషులు అనిపించింది. బతికి ఉండగానే మనకి సంబంధం ఉన్న వారిగాను చని పోగానే అనాధ గా వదిలేయడం ఏ మాత్రం అయినా హర్షిస్తామా? పాపం ఏ పాపము యెరుగ కుండానే ఆమె అన్యాయముగా  భర్త చేతిలో హత్య గావిన్పబడి అతని అరాస్ట్  తో  అనాధ  శవంగా  మిగిలి పోయింది. ఇలాటివి ఎన్ని ఎన్నో మా అనుభవాల్లో ఉంటాయి. నేరాలని ఘోరాలని ప్రత్యక్షం గా చూసిన మేము పాషాణ హృదయం తో కరకు తెలిపోతం అంటే ఇలాటి సంఘటనలు వల్లే! ఇలాటివి ఇంకా చాలా ఉన్నాయి.  అవి  ఇంకోసారి.   








Sunday, June 26, 2011

పాటల పల్లకి లో

నాకు నచ్చిన పాట ఒకటి.. చెపుతాను..
 నువ్వు వస్తావని సినిమాలో.. పాటల పల్లకి లో..అనే పాట నాకు చాలా ఇష్టం. 

 


Thursday, June 23, 2011

నేనొక.. కొత్త బ్లాగర్ని.

అందరికి  నమస్కారములు.నేనొక.. కొత్త బ్లాగర్ని.  నా పేరు విష్ణు.
నాలో ఉన్న అనంత భావాలని.. మీ అందరితో.. పంచుకోవాలని..ఇలా మీ ముందుకు వచ్చాను.
నా లో ఊపిరి పోసుకున్న భావాలు.. నాకు తెలిసీతెలియని..ఆలోచనలు..అంతు లేని ప్రశ్నలు..
మొత్తం  కలసి నేను.