ఈ రోజు ఫ్రెండ్ షిప్ డే. భలే కొత్త విషయం చెపుతున్నాను కదూ..
నేను నా ఫ్రెండ్ ఒకరి గురించి చెప్పాలనుకుంటున్నాను. అతని పేరు రవి కుమార్.
అతనికి మౌని అని ఇంకొక ఫ్రెండ్ఉన్నాడు. మౌని ఒకసారి రవిని ఇరవై అయిదు వేల రూపాయలు అడిగాడు. రవి ఎప్పటికి కావాలి అని అడిగాడు మౌనిని. నాకు రేపు ఉదయం తొమ్మిది గంటలకి..ఇవ్వగలవా? అని అడిగాడు.మౌని.
రవి అతనికి ఉదయం ఏడున్నర గంటలకల్లా..అధిక వడ్డీకి తీసుకుని వచ్చి మిత్రునిని ఆదుకున్నాడు. అందుకు మా స్నేహితుడు స్నేహితుడు మౌని చాలా సంతోషించాడు.
కానీ ఓకే రోజు రవి మౌనిని కేవలం అయిదు వందల రూపాయలు మాత్రమె అప్పు అడిగాడు.ఒక గంటలో ఇస్తానని చెప్పి వెళ్ళిపోయి ఆ రోజంతా మొహం చాటేశాడు మౌని. తర్వాతి రోజు కూడా మళ్ళీ అడిగాడు రవి. సాయంత్రం ఇస్తానని చెప్పాడు.మౌని .కానీ అతను ఆరోజూ ఇవ్వలేదు.అతని వద్ద డబ్బు లేదా అంటే అదేమీ కాదు. అతని వద్ద చాల డబ్బు అప్పుడు ఉంది. కానీ మౌని ఇవ్వడానికి మొహం చాటేశాడు. అలా జరిగింది.
మళ్ళీ కొన్నాళ్ళకి మౌనికి డబ్బు అవసరపడింది. రవిని అప్పు కావాలని అడిగాడు.రవి వెంటనే ఇంటికి వెళ్లి బంగారు నగలు తెచ్చి తాకట్టు పెట్టి మరీ మౌనిని ఆదుకున్నాడు.అలా కొన్నాళ్ళు గడిచాక నిన్ననే ..కేవల రెండువండలు పెట్రోల్ కోసం అప్పు అడిగాడు రవి.నా దగ్గర లేనేలేవని హ్యాండ్ ఇచ్చాడు మౌని
![]() |
| స్నేహమంటే.. విరిసిన హరివిల్లు లాటిది. |
మౌని లాటి వారికి..నా ఫ్రెండ్ రవి లాంటి ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టం. స్నేహాన్ని ఎప్పుడు తన స్వార్దానికే ఉపయోగించుకున్న మౌని లాటి వారు చాలా మంది ఉంటారు.వారిని ఏం అనాలి.? ఫ్రెండ్స్ అనాలా/ అవకాశవాదులు అనాలా? స్నేహమంటే ..తీసుకోవడమే కాదు. ఇవ్వడం కూడా..అని ఎవరికనినా చెప్పాలనే..ఈ మాట చెపుతున్నాను. రవి లాటి మిత్రుడు అందరికి దొరకరు.అందుకే రవిని చూస్తే నాకు చాలా గర్వం.
అందరికి..స్నేహితుల రోజు శుభాకాంక్షలు తో.. విష్ణు.
